Ceiling Fan: ఈ వేసవి కాలంలో చాలామంది ఎండ వేడి తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు మరియు ఏసీల ముందు కూర్చుండి పోతారు. అయితే ఏసీలు, కూలర్ల కంటే సీలింగ్ ఫ్యాన్ల గాలి కాస్త వేడిగా వస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ఫ్యాన్ నుంచి కూడా ఏసీ లాంటి చల్లని గాలి రావాలంటే ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు. దేశంలో ఇప్పుడు వేసవి ప్రారంభమైపోయింది. వేడి కారణంగా మీ ఇంట్లో పరిస్థితి దారుణంగా మారకముందే మీ ఇంట్లోని ఫ్యాన్లను ఏసీ లాగా మార్చుకోండి. ప్రజలు ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కొంతమంది తమల ఇండ్లలో ఏసీలు కూడా అమర్చుకోవాలని అనుకుంటున్నారు. అలాగే మరి కొంతమంది కూలర్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా సీలింగ్ ఫ్యాన్ తోనే సరి పెట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ సీలింగ్ ఫ్యాన్ ను ఉపయోగించి కూడా మీరు వేడిని నివారించుకోవచ్చు. మీ సీలింగ్ ఫ్యాన్ గాలిని ఏసీ లాగా చల్లగా మార్చుకోవచ్చు. మీ ఇంట్లో అమర్చిన సీలింగ్ ఫ్యాన్ వేడి గాలిని ఇస్తున్నట్లయితే అది ఉన్న స్థానం సరైనది కాదని తెలుసుకోండి. ఫ్యాన్ బ్లేడ్లు సరైన స్థానంలో ఉండడం వలన చల్లని గాలి వస్తుంది. ఫ్యాన్ కు ఉన్న బ్లేడ్లు వంకరగా లేదా వదులుగా ఉన్న వెంటనే దానిని రిపేరు చేయించుకోండి.
అలాగే ఫ్యాన్ లో ఉండే కెపాసిటర్ పాడైపోయిన లేదా పాతది అయిపోయినా కూడా అది ఫ్యాన్ గాలి వేగాన్ని తగ్గిస్తుంది. ఇటువంటి సమయంలో కొత్త కెపాసిటర్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలామంది వేసవికాలంలో తడితువాలు తలపై వేసుకొని వెళ్తుంటారు. ఇలా చేయడం వలన చుట్టూ ఉన్న వేడిగాలి కూడా చల్లగా అనిపిస్తుంది. ఫ్యాన్ గాలిని చల్లగా మార్చుకోవడానికి మీరు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. మీరు టేబుల్ ఫ్యాన్ ముందు ఏదైనా వేలాడదీయండి. ఇలా చేయడం వలన గాలి చల్లగా అనిపిస్తుంది. మీ ఇంటి గదిలో కిటికీ ఉంటే దానిని తెలిసి ఉంచండి. ఇలా క్రాస్ వెంటిలేషన్ ఉండడం వలన చల్లని గాలి గదిలోకి వస్తుంది. కిటికీ మీద మీరు టేబుల్ ఫ్యాన్ కూడా ఉంచుకోవచ్చు.