UPI: ఈరోజుల్లో చాలామంది యూపీఐ ఆప్ ను మనీ ట్రాన్స్ఫర్ కోసం వాడుతున్నారు. అయితే యూపీఐ ఆప్ ద్వారా ప్రతిరోజు ఒక లక్ష రూపాయల వరకు డబ్బును పంపించుకోవచ్చు. అయితే బ్యాంకును బట్టి పరిమితులు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు ఈ పరిమితిని తగ్గించుకోవచ్చు. ఎన్పీసీఐ ఏప్రిల్ ఒకటి నుంచి వాడకంలో లేని ఫోన్ నెంబర్లతో లింక్ అయినా యూపీఐ ఐడి లను తొలగించనుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద హోటల్లో దగ్గర నుంచి చిన్న చిన్న టీ స్టాల్ ల వరకు కూడా యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు.
UPi | రోజుకు ఎంత డబ్బు పంపించుకోవచ్చు
యూపీఐ యాప్ వినియోగం పెరుగుతున్న క్రమంలో యూపీఐ ద్వారా రోజుకు ఎంత డబ్బు పంపించవచ్చో చాలామందికి తెలియదు. రోజుకు ఎంత మొత్తం డబ్బులు పంపించుకోవచ్చో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే యూపీఐ ద్వారా ఒక రోజుకు మాక్సిమం లక్ష రూపాయల వరకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కొన్ని బ్యాంకులు తమ విధానాలను అనుసరించి ఈ పరిమితిని 25 వేల నుంచి 50,000 వరకు తగ్గించాయి. ఒకవేళ ఎవరైనా యూపీఐ పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ఆర్టిజిఎస్ లేదా ఎన్ ఈ ఎఫ్ టి వంటి బ్యాంకు సేవలను వినియోగించాలి.
యూపీఐ ఆప్ లో ప్రతిరోజు ట్రాన్సాక్షన్ పరిమితిని విధిస్తూ ఉంటాయి. కొంతమంది వినియోగదారులకు రోజుకు లక్షకు మించి లావాదేవీలను చేయనివ్వరు. మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు పంపించాలి అనుకున్నప్పుడు ముందుగా బ్యాంకు విధానాలను సమీక్షించడం మంచిది. ఒకవేళ మీరు పెద్ద మొత్తాల్లో లావాదేవీలు చేయాల్సివస్తే ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలను అనుసరించాలి. యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్న సమయంలో సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్ ను వినియోగించాలి. అలాగే యూపీఐను వినియోగించే వినియోగదారులు తమ బ్యాంకు యొక్క నిబంధనలను ముందుగా తెలుసుకొని ఆ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటే లావాదేవీలు చాలా వేగంగా మరియు సురక్షితంగా పూర్తవుతాయి.