Airport Rules: విమానంలో ప్రయాణించే వాళ్లకు నగదు విషయంలో ఒక లిమిట్ ఉంటుంది. వాళ్లు నవ్వుతూ తీసుకొని వెళ్లాలంటే ఒక లిమిట్ వరకు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అయితే చాలామంది దేశీయంగా మరియు అంతర్జాతీయంగా డబ్బులు విత్ డ్రా చేసే అవకాశం ఉన్నప్పటికీ తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకొని వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ మీకు నచ్చినంత డబ్బును విమాన ప్రయాణాల్లో అధికారులు అనుమతించారు. వీటి కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. విమానంలో ప్రయాణికులు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే టికెట్లు బుక్ చేసే ముందు అందరూ ఎక్కువగా అడిగే ప్రశ్న విమానంలో ఎంత నగదు తీసుకొని వెళ్ళవచ్చు.
అయితే దేశీయ అంతర్జాతీయ విమానాల మధ్య నియమాలు మారతాయి. జనాలు అంతర్జాతీయ ప్రయాణమైన లేదా దేశీయ ప్రయాణమైన కూడా ఈ మాన ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే విమాన ప్రయాణం వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి చాలా వేగవంతమైన మార్గం. అయితే చాలామందికి విమాన ప్రయాణంలో సామాను ఎంత తీసుకోవచ్చో దాని పరిమితుల గురించి తెలిసి ఉండవచ్చు కానీ విమాన ప్రయాణంలో నగదు ఎంత మొత్తంలో తీసుకొని వెళ్లొచ్చు దాని నిర్దిష్ట పరిమితులు ఎంతో చాలామందికి తెలియదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం దేశీయ విమానాల్లో ప్రయాణించే వాళ్ళు 2 లక్షల రూపాయల నగదును తీసుకొని వెళ్లొచ్చు.
కానీ విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ నియమం మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు నేపాల్ లేదా భూటాన్ తప్ప వేరే ఏ ఇతర దేశానికైనా విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు 3 వేల యూఎస్ డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకొని వెళ్లవచ్చు. ఒకవేళ మీరు దీనికంటే ఎక్కువ నగదు కోసం స్టోర్ వాల్యూ కార్డులు లేదా ట్రావెలర్స్ చెక్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే విమాన ప్రయాణంలో చెక్ ఇన్ సామాను బరువు 30 కిలోలకు మించి ఉండకూడదు. ఈ నియమం ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారుతుంది. అలాగే హ్యాండ్ లగేజీ బరువు 7 కిలోలు మించి ఉండకూడదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి.