Wednesday, 8 October 2025, 9:14
Election Commission
Election Commission

Election Commission: ఆధార్ తో ఓటర్ కార్డు అనుసంధానం తప్పనిసరి.. కీలక ప్రకటన చేసిన ఈసీ

Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై రాజకీయ పార్టీల సూచనలు మేరకు కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ క్రమంలో ఓటర్ ఐడి తో ఆధార్ లింక్ పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని స్పష్టం చేసింది. త్వరలోనే ఓటర్ ఐడి తో ఆధార్ ను అధికారులు అనుసంధించే క్రమంలో ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓటర్ ఐడి, ఆధార్ అనుసంధానం పై చర్చించడం జరిగింది. ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో ఈసీలు డాక్టర్ సుఖ బీర్ సింగ్ సందు, డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యుఐడిఏఐ సీఈవో, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ భేటీలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారతదేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, ఓటర్ల యొక్క గుర్తింపు కార్డు ని ఆధార్ తో అనుసంధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 1950, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చేయాలని నిర్ణయించారు.

అయితే విషయంపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. త్వరలో యుఐడిఏఐ సాంకేతిక అంశాలపై అధికారులతో సంప్రదింపులు చేయనున్నట్లు ఈసీ స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై సమావేశానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు అలాగే చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ల స్థాయిలో ఎవరైనా పరిష్కారం గాని సమస్యలపై ఈ ఏప్రిల్ 30 నాటికి అన్ని జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు ఈసీ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *