Kaithi Movie: ఈమధ్య కాలంలో దర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు పోటీపడుతున్నారు. అయితే కంటెంట్ బాగున్న సినిమాలు జనాలు మనసులో చాలా కాలం వరకు ఉండిపోతాయి. అలా సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సినిమాలు చాలా రేర్ గా ఉంటాయి. అలా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇతను తన సినిమాల కోసం ఏకంగా ఒక యూనివర్స నే క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఖైదీ సినిమా కూడా ఒకటి.
కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యింది. ఈ దర్శకుడి మేకింగ్ మరియు టేకింగ్ కు అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు కురిసాయి. ఖైదీ సినిమా కథ మొత్తం ఢిల్లీ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఢిల్లీ కూతురు ఆముదగా నటించిన చిన్నారి పేరు మౌనిక. ఈ సినిమాలో ఈ చిన్నారి పాత్ర చాలా కీలక. ఈ సినిమాలో మౌనిక హీరో కూతురిగా నటించింది. ప్రస్తుతం మౌనిక సరికొత్త లుక్ లో మారిపోయింది. ఇప్పటివరకు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించింది. బేబీ మౌనికకు సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో 30 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
మౌనిక ది ప్రీస్ట్ సినిమాకు గాను మాలీవుడ్ ఫ్లిక్స్ నుంచి ఉత్తమ బాల నటి అవార్డును కూడా అందుకుంది. మరి కొన్ని రోజులలో మౌనిక హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మౌనిక తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఖైదీ మూవీ చిన్నారి మౌనిక షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో మౌనికని చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు.
View this post on Instagram