Jio SIM: క్రికెట్ ప్రియుల కోసం తాజాగా జియో కొత్త ప్లాన్ ను తీసుకుని వచ్చింది. 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ పై 4 కె లో క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూసేందుకు జియో కొత్త ప్లాన్ ప్రకటించింది. కొత్త జియో సిమ్ వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా ఉంటుంది. అయితే జియో వినియోగదారులు కొత్త సినిమా రూ.299 లేదా ఎక్కువ ప్లాన్ తో ఈ క్రికెట్ సీజన్లో జియో ద్వారా వీక్షించగలుగుతారు. గతంలో క్రికెట్ సీజన్ల తో పోలిస్తే ఇది ఒక కొత్త దశను సూచిస్తుంది. జియో వినియోగదారులు ఇప్పుడు టీవీ మరియు మొబైల్ పై ఫోర్ కే లో క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు.
ఈ సరికొత్త ప్లాన్ లో వినియోగదారులు రెండు ప్రధాన ప్రయోజనాలను పొందగలరు. మొదటిది జియో హాట్ స్టార్ పై మీరు 90 రోజులపాటు ఉచితంగా ఫోర్ కెలో క్రికెట్ మ్యాచ్‌లను చూసుకోవచ్చు. ఈ క్రికెట్ సీజన్లో నీ అన్ని మ్యాచ్‌లను జియో హాట్ స్టార్ పై 4k లో టీవీలో లేదా మొబైల్ పై ఉచితంగా చూసుకోవచ్చు. కేవలం జియో వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
అలాగే జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ ద్వారా వినియోగదారులకు 50 రోజుల పాటు ఉచిత ట్రైల్ కనెక్షన్ అందిస్తున్నారు. ఇది కస్టమర్లకు అతివేగవంతమైన ఇంటర్నెట్ సేవలను మరియు ఉత్తమ హోం ఎంటర్టైన్మెంట్ను ఉచితంగా ఆస్వాదించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. జియో కస్టమర్లకు ఎయిర్ ఫైబర్ ద్వారా 800+టీవీ ఛానళ్లు, 11+ఓటిటీ యాప్‌లు అలాగే అన్లిమిటెడ్ వైఫై వంటి అత్యుత్తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ ను పొందడానికి వినియోగదారులు 17 మార్చి నుంచి 31 మార్చి 2025 మధ్య జియో సిమ్ రీఛార్జి చేయించుకోవాలి లేదా కొత్త జియో సిమ్‌ను తీసుకోవాలి.