LPG Cylinder: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను ఉపయోగిస్తున్నారు. అయితే సిలిండర్ వాడే వినియోగదారులు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. వాళ్లు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ బిల్లును అంతగా పట్టించుకోరు. ఇక్కడ మీరు మోసపోయే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ ఈరోజుల్లో చాలా కీలకం. ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ తప్పకుండా ఉంటుంది. లేదంటే వంట చేయడం చాలా కష్టం అవుతుంది. అయితే ప్రతి ఇంట్లో కూడా సిలిండర్ రెండు లేదా మూడు నెలల వరకు వస్తుంది. ఎక్కువ మనుషులు ఉన్న ఇంట్లో సిలిండర్ త్వరగానే అయిపోతుంది. మీ ఇంట్లో వాడకాన్ని బట్టి సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందో ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వినియోగదారులకు సిలిండర్లపై రాయితీ అందిస్తూ వస్తుంది.
ఒక ఏడాదికి వినియోగదారులు దాదాపు 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ధరకు పొందవచ్చు. ప్రస్తుతం కూడా ఇదే జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. కుటుంబంలో ఉన్న సభ్యుల ఆధారంగా ఒక ఏడాదికి కేవలం మూడు నుంచి నాలుగు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు వాడే వాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళకు సబ్సిడీ సిలిండర్లు చాలా మిగిలిపోతాయి. ఇలా తక్కువ సబ్సిడీ సిలిండర్లు వాడే వాళ్లను గ్యాస్ డెలివరీ బాయ్స్ టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. బుక్ చేసుకోకుండా మిగిలిపోయిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను గ్యాస్ డెలివరీ బాయ్స్ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే వీటి ద్వారా వాళ్ళు డబ్బులు పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఘటన ఒకటి అందరి దృష్టిలోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక సిలిండర్ వినియోగదారునికి ఫోన్కు మెసేజ్లు వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినట్లు ఆ మెసేజ్ లో ఉంది. కానీ ఆ సదరు వ్యక్తి మాత్రం సిలిండర్ బుక్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి అందరూ కంగారు పడ్డారు. ఫోన్ కు వచ్చిన మెసేజ్ లో బుకింగ్ కోడ్ తో పాటు ఓటిపి మరియు ఎంత డబ్బు చెల్లించాలి వంటి అన్ని వివరాలు ఉన్నాయి. దాంతో అనుమానం వచ్చిన వినియోగదారుడు వెంటనే సదురు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి ఇదంతా చేసినట్లు బయటపడింది. ఆ వ్యక్తి సబ్సిడీ సిలిండర్ను బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు తేలింది.