Ration Card: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు రెండు లక్షల నుంచి నాలుగు రక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం 6000 కోట్లు కేటాయించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 17న ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోసం నిరుద్యోగ యువత ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారులు అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి సాయం అందిస్తారు.
అలాగే ఈ పథకంలో 60 శాతం నుంచి 80% వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. ఈ స్కీమ్ చేయాలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఏ డాక్యుమెంట్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి అధికార వెబ్సైట్ https:/ tgobmms.cgg.gov.in/ లోకి వెళ్లాలి. ఈ అవకాసం ఎస్సి, ఎస్టి, బీసీ మరియు మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు ఉంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే ఆధార్ నెంబర్ రేషన్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి. రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద సాయం లభిస్తుంది.
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఆధార్ కార్డు, కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఫోన్ నెంబర్. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అర్హులైన వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అర్హత ధ్రువీకరణ ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు చేస్తారు. ఆ తర్వాత తుది జాబితా జూన్ రెండున ప్రకటిస్తారు. అప్లై చేసుకోవడానికి పైన తెలిపిన అధికార వెబ్సైట్లోకి వెళ్లి హోం పేజీలో రాజీవ్ యువ వికాసం అనే లింకు పై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారం ఓపెన్ చేసి ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి. వ్యక్తిగత, వృత్తి మరియు విద్యా వివరాలు అన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్ మరియు రేషన్ కార్డు నెంబర్లను ఎంటర్ చేసి సెక్టార్‌ను ఎంచుకోవాలి. వివరాలు అన్ని పూర్తి చేసి సరిచూసుకొని సబ్మిట్ బటన్ నొక్కాలి. కుల మరియు ఆదాయపత్రాల వివరాలు మరియు చిరునామా నమోదు చేయాలి. అన్ని వివరాలు కూడా సరిగ్గా ఉంటే సబ్మిట్ చేయండి.