Cash Limit At Home: ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న యుగంలో ఇంట్లో నగదు నిల్వ పరిమితిపై కూడా అందరికీ అవగాహన చాలా అవసరం. డిజిటల్ లావాదేవీలు వృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా చాలామంది తమ సౌలభ్యం లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఇంట్లో నగదును నిలువ చేసుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి చట్టపరంగా ఇంట్లో ఎంతవరకు నగదు ఉంచుకోవచ్చో తెలియదు. అయితే భారత చట్టం దీని గురించి స్పష్టంగా ఏదైనా పరిమితిని విధించకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో వివరణ లేని నగదు ఇంట్లో నిల్వ ఉంటే ఆదాయపు పన్ను అధికారులు తనిఖీ చేసే అవకాశం ఉంది.
ఈ పరిస్థితి భారీ జరిమాణాలు మరియు విచారణకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఆర్థిక పారదర్శకత పెరుగుతూ ఉండడంతో ఆదాయపు పన్ను నిబంధనలు కూడా చాలా కఠినంగా మారాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైన ప్రతికూలతల నుండి దూరంగా ఉండడానికి ఈ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చట్టపరంగా ఇంట్లో ఎంతవరకు నగదు ఉంచుకోవచ్చు అని దానిపైన నేరుగా ఎలాంటి నిషేధం లేకపోయినా కూడా ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని నిబంధనలు నగదు వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ నిబంధనలో విభాగం 69 A ఆదాయపు పన్ను అధికారులు తనిఖీ చేసిన సమయంలో వివరణ లేని నగదు ఇంట్లో ఉంటే దాన్ని ఆదాయంగా పరిగణించి 60 శాతం పన్ను, అదనపు సబ్ ఛార్జ్ విధిస్తారు. అలాగే విభాగం 269 ఎస్టి ఒక వ్యక్తి నుండి ఒకేరోజు రెండు లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయడం కూడా చట్టబద్ధం కాదు. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే లావాదేవీ మొత్తానికి సమానమైన జరిమాన విధిస్తారు. ఇది భాగాలు 269 ఎస్ఎస్ మరియు 269 టీ ప్రకారం బ్లాక్ మనీ నిరోధించడానికి 20000 లేదా అంతకంటే ఎక్కువ రుణాలు, డిపాజిట్లు నగదుగా స్వీకరించడాన్ని లేదా తిరిగి చెల్లించడాన్ని ఈ నిబంధనలు నిరోధిస్తున్నాయి.