KGBV Admissions: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల గురించి చాలామందికి తెలుసు. ఈ విద్యాలయాల ప్రధాన ఉద్దేశం సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం. తాజాగా లోకల్ 18 తో మాట్లాడిన అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎం వెంకటరమణ కేజీబీవీ లలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎనిమిది కేజీబీవీ లలో 611 తరగతిలో బాలికల ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అని తెలిపారు. అలాగే 7,8,9,10,12 తరగతుల్లో ఉన్న మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన అర్హతలు.. అనాధలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్స్, పేద, ఎస్ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, బీపీసీ బాలికలు మాత్రమే ఈ విద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. అయితే ఈ దరఖాస్తు అప్లికేషన్ను అధికారిక వెబ్సైట్ అయిన http:/apkgbv.apcfss.in/ ద్వారా పొందగలరు. ఈ ప్రక్రియలో ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు.
సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో వాళ్లు నేరుగా చూసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే ఈ 7075159996, 7075039990 నెంబర్లకు సంప్రదించాలి. అలాగే లోకల్ 18 ద్వారా పాఠశాల ఎస్ఓ స్వరూప బైరెడ్డిపల్లి మండలం మరియు కమ్మనపల్లిలో కేజీబీవీ లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందని తెలియజేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను కమనపల్లి కేజీబీవీ లో 61 తరగతుల్లో మూడు బాలికల ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు.