UPI New Rules: బ్యాంకు ఖాతాకు లింక్ చేయని మొబైల్ నెంబర్లతో యూపీఐ సేవలు ఏప్రిల్ 1, 2025 నుంచి పనిచేయవు. ఎన్పీసీఐ కొత్త మార్గదర్శకాలు మద్దతు కారణాల వలన త్వరలో అమల్లోకి వస్తున్నాయి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం లాంటి యూపీఐ చెల్లింపు యాప్లను ఉపయోగిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం. కొన్ని మొబైల్ నెంబర్లలో ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ యాప్ లో పనిచేయకపోవచ్చు. కొన్ని భద్రతా కారణాల వలన ఎన్పీసీఐ తాజా మార్గదర్శకాలను అమలులోకి తెస్తుంది. బ్యాంకు ఖాతాకు లింకు చేయని మరియు మార్చబడిన మొబైల్ నెంబర్లతో యూపీఐ సేవలు పనిచేయడం ఏప్రిల్ ఒకటి నుంచి ఆగిపోతాయి.
దీనికి ప్రధాన కారణం పాత మరియు క్రియా రహిత నెంబర్లను తొలగించడం. బ్యాంకు ఖాతాకు లింకు చేయని నెంబర్లను బ్లాక్ చేస్తారు. ఎన్పీసీఐ సైబర్ మోసాలను నిరోధించేందుకు కొత్త భద్రతా చర్యలు అమలు చేయనుంది. కేవైసీ అప్డేట్ చేయని వినియోగదారులకు పరిమితులు కూడా ఉన్నాయి. మీ యూపీఐ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలంటే వెంటనే ఇలా చేయండి. ముందుగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ను చెక్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మారినట్లయితే బ్యాంకు ఉన్న బ్రాంచ్ కి వెళ్లి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కొత్త నెంబర్ను అప్డేట్ చేసుకోండి.
మీరు యూస్ చేస్తున్న గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం సెట్టింగ్లలో మేనేజ్ అకౌంట్ విభాగంలో కొత్త నెంబర్ను రిజిస్టర్ చేసుకోండి. ఎంపీసీఐ అధికార వెబ్సైట్లో కొత్త మార్గదర్శకాలను చదివి అవసరమైన కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యాప్ లను యూస్ చేయండి. ఒకవేళ మీరు ఏప్రిల్ ఒకటి లోపు బ్యాంక్ అకౌంట్ తో నెంబర్ ను లింక్ చేయకపోతే యూపీఐ లావాదేవీలు నిలిచిపోతాయి. ఈ క్రమంలో గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వంటి యాప్లు పనిచేయవు.