Ration Card e-KYC : ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే గడువు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 31 వరకు ఉన్నాయి గడువు ప్రస్తుతం ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఉచిత రేషన్ ఆగిపోతుంది. ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ప్రకటించింది. వెంటనే రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఏప్రిల్ 30 లోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
ఈ గడువు దాటితే మీకు ఉచిత రేషన్ రాదు. ఆ తర్వాత మీరందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పేద వర్గాలు, మహిళలు మరియు రైతుల కోసం ప్రత్యేక పథకాలను ఇప్పటికే అమలు చేసిందే. ఈ పథకాలతో దేశంలోని కోట్లాదిమందికి ప్రయోజనం జరుగుతుంది.
చాలామంది పేద కుటుంబాలు ఆహారం కోసం ప్రభుత్వం పై ఆధారపడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం భారతదేశ ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత రేషను అందిస్తుంది. అలాగే ప్రభుత్వం మరికొంతమందికి నామమాత్రపు ధరలతో రేషన్ అందిస్తుంది. ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ పొందాలంటే మీకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. మీకు రేషన్ కార్డు ఉన్నట్లయితే వెంటనే మీరు దానికి సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం వహిస్తే మీ రేషన్ కార్డు నుంచి మీ పేరును తొలగిస్తారు. ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30. ఈ ప్రక్రియను చేయడానికి రేషన్ దుకాణాదారుడిని సంప్రదించాలి. చాలా ప్రాంతాలలో క్యాంపులను ఏర్పాటు చేసి ఈ కేవైసీ ప్రక్రియ చేస్తున్నారు.